30, సెప్టెంబర్ 2012, ఆదివారం

అజెండా

             కొంటె ప్రశ్నలు
1)ఎగరవేయలేని జెండా?
అజెండా
2)వానర రాజు ఎక్కడ ఉన్నాడు?
కావాలి లో
3)చెట్టుకు కాయని కాయలు?
బకాయిలు
4)కూర్చోలేని ఆసనం?
ధర్మాసనం
5)రాజు లేని రాణి ఎవరు ?
పారాణి
6)రైతు పట్టని హలం అ?
కోలాహలం
7)ఏడిస్తే ఏమౌతుంది ?
కన్నీలొస్తాయి
8)ఎవరూ తాగని సారా ?
వసారా
9)గుండు హనుమంత చేయించుకోనిది ?
గుండు
10)రాజు లేని రాణి ?
పారాణి
_____అయ్యగారి రామక్రిష్న

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

మునగ

     కొంటె ప్రశ్నలు
1)పరసులో పెట్టుకోలేని ధనం?
ఇంధనం
2)షరాబు చెయ్యని నగ?
సెనగ
3)గుడిలో చెయ్యని భజన?
విభజన
4)ధరించలేని నగ?
మునగ
5)శ్రీరామునికి సాయం చెయ్యని వాలి ?
రావాలి
6)దేవుడు ఇవ్వని వరం ?
సురవరం
7)పంచాంగంలోలేని తిధి ?
అతిధి
8)బీహారులో కొందరు  తాగేది ?
బీరు
9)విషయంలో హానికలిగించేది ?
విషం
10)షిరిడీలో భక్తులు లేని సాయి ?
కసాయి

19, సెప్టెంబర్ 2012, బుధవారం

తమాషా ప్రశ్నలు

NAMO NARAYANAYA
TIRUMALA TIRUPATI BALAJI TEMPLE




కొంటె ప్రశ్నలు


             కొంటె ప్రశ్నలు
1)కదలకుండా ఎగిరేది ?
2)షిరిడీలో భక్తులు మొక్కని సాయి ఎవరు?
3)వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది?
4)తవ్వితేగాని కనబడని నిజం ఏది?
5)తినలేని జాం ఏది?
జవాబులు 1)జెండా

 2)కసాయి  3) చలివేంద్రం లో 4)ఖనిజం ) 5)ట్రాఫిక్ జాం