29, ఫిబ్రవరి 2012, బుధవారం

గోదావరి

ఈక్రింది పదాలలో ప్రక్కన ఇచ్చిన ఆధారానికి తగ్గ ఆంగ్ల పదానిక తగ్గ అక్షరం రాయండి
1)గోదావరి లో  వెల్లు  ( గో )
2)దేవదాసు లో వారు ( దే )
3)కౌరవులు  లో ఆవు   ( కౌ )
4)డేవిడ్   లో దినము  ( డే )
5)జాబితా   లో  దౌడ  ( జా )

27, ఫిబ్రవరి 2012, సోమవారం

మీనా


1)సునామీ లో ఉన్న
 హీరోయిన్ ఎవరు
మీనా
2)చెట్టుకు వేలాడే

 నరం
వానరం
3)కనబడని కారు
షావుకారు
4)ఎవరికీ లేని 

దంతం
ఉదంతం
5)టైలర్ కుట్టలేని లాగు
డైలాగు
6)రాజు చెయ్యలేని రణం
కారణం
7)దేవుడు ఇవ్వని

 వరం
వివరం
8)లావేరులో చెట్టులో

 కనబడని భాగం
వేరు
9)ఉద్యోగంలో నీరున్నది

 ఎవరు
ఇంజనీరు
10)పోరాటం చేసే వారిని

 కోపంగా వెల్లమనండి
పోరా

18, ఫిబ్రవరి 2012, శనివారం

నిజం

         నిజం
1)నోటితో చెప్పలేని నిజం
ఖనిజం
2)ఆడవారికి అవసరమైన వరం
సవరం


3)మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
4)టైలర్ కి పనికిరాని దారం
మందారం
5)మునులు ఇష్టమైన కారం
ఓంకారం
6)అమలాపురం లో ఉన్న మీభందువుని పిలవండి
అమలా
7)నటులు వెయ్యలేని పాత్ర
వంటపాత్ర
8)రావాలి లో వానర రాజు
వాలి
9)చెప్పలేని ధర
వసుంధర
10)లాభాలు లో బీహార్ నాయకుడు
లాలు

పూబంతి








1)ఎవరూ చెప్పలేని నిజం
ఖనిజం
2)అమలాపురం లో ఉన్న మీ భందువుని పిలవండి
అమలా
3)ఆడవారికి అవసరమైన వరం
సవరం
4)మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
5)టైలర్ వాడని దారం
మందారం
6)పిల్లలు కి పనికిరాని లాగు
కేటలాగు
7)రాజులు చెయ్యని రణం
తోరణం
8)అశుభంగా తలచే ఆకులు
విడాకులు
9)ఆడలేని బంతి
పూబంతి
10)రాజులు యుద్ధం లో  వాడని డాలు  
అప్పడాలు

15, ఫిబ్రవరి 2012, బుధవారం

కొంగ



       కొంగ
ఎగిరేది కొంగ
ఎగరలేనిది కొండ
కూరకి పనికి వచ్చేది దొండ
కూరకి పనికిరానిది   తొండ
కూరకి కావాలి కారం గుండ

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఫిరంగులు





1)అరవకుండా భయపెట్టే కాకులు?
చికాకులు
2)చూడలేని నయనం?
ఉపనయనం
3)చేపలు పట్టడానికి పనికిరాని వలలు?
కవలలు
4)ఎగిరే నరం?
వానరం
5)పేలే రంగులు?
ఫిరంగులు
6)ఎవరూ చూడలేని రూపం ?
అపురూపం
7)చూసి చెప్పే రుచి ?
అభిరుచి
8)ఆవు ఇవ్వని పాలు ?
జులపాలు
9)కూరలో వెయ్యలేని కారం
మమకారం
10)జాలారి పట్టలేని ఫిష్ ?
సెల్ ఫిష్