23, జనవరి 2012, సోమవారం

విగ్రహాలు


1)తిరగని గ్రహాలు
విగ్రహాలు
2)నామాలు లేని వ్రతం
మౌనవ్రతం
3)నాలుకతో చెప్పలేని రుచి
అభిరుచి
4)వేలాడే పాలు
జులపాలు
5)తినలేని వడ
దవడ
6)ఎప్పుడూ వెలెగే జ్యోతి
ఆశా జ్యోతి
7)తొండలో శరీర భాగం
తొడ
8)లోక్ పాల్  లో ప్రక్కనున్న దేశం
పాక్
9)దారుణంలో పసువులు తినేది
దాణ
10)బీరుదొరకని బారు
సాంబారు 

మొక్కజొన్న



1)మొక్కజొన్న లో రెండు రోజుల క్రితం
మొన్న
2)ఆదుకోండి లో నిద్ర లేపేది
కోడి
3)పనిమనిషి లో ఆమె
షి
4)యువరాజులో మీరు
యు
5)హిస్టరీలో అతడు
హి
6)గోదావారిలో వెల్లు
గో
7)మేస్త్రికట్టని భవనం
వక్రీభవనం
8గీయలేని రేఖ 
లక్ష్మణ రేఖ
9)పోరాటంలేని రణం
దుర్మరణం

10)మనుషులు నివసించలేని భవనం
వక్రీభవనం

22, జనవరి 2012, ఆదివారం

చలి


1)చలిమిడిలో దాగున్న కాలం
చలి
2)పరకాల లో  వాచ్ మ్యాన్ చేసే పని
కాపలా
3)వడ్డి తాండ్రలో తినేది
తాండ్ర
4)వులవపాడులో చెల్లనిది
పావ

5)వరంగల్లు లో దేవునికొరేది
వరం
6)నాగులవలసలో ప్రజలు వెల్లేది
వలస
7)కడప తిరగపడితే
పడక
8)విరోధి లో తప్పించుకోలేనిది
విధి
9)బారువలో ఉన్న మీ భంధువుని పిలవండి
బావ
10)తివాచీ లో కాలాన్ని చెప్పేది
వాచీ 

19, జనవరి 2012, గురువారం

తామర




1)చర్మానికి సోకే పూలరోగం
తామర
2)అమ్మపెట్టలేని చారు
అరిచారు
3)పోరాటం లో కోపంగా వెల్లమనేది
పోరా
4)ధనం ఇచ్చి కొనుక్కొనే ధనం
ఇంధనం

5)సినిమా హీరో చెయ్యలేని పాత్ర
వంటపాత్ర
6దేవుడులేని ఆలయం
కార్యాలయం
7)పదిలం లో ఉన్న జంతువు
పంది 
8)సర్పంచి లో బజారుకివెల్తే అవసరమైంది
సంచి
9)బచ్చలి కూరలో అమ్మవారికి బలి ఇచ్చెది
బలి

10)ఉండవల్లిలో చలవ చేసేది
ఉల్లి   

హరివిల్లు

1)పరసులో దాచుకోలేని ధనం
ఇంధనం
2)ఎరువుగావాడే పోస్ట్
కంపోస్ట్
3)ఇంటికిచుట్టూ ఉండే కారం
ప్రాకారం
4)మనిషి ముట్టుకోలేని విల్లు
హరివిల్లు
5)రోడ్డు మీద లేని బ్రిడ్జి
కేంబ్రిడ్జి
6)మనిషికి లేని గోల్లు
కొనుగోల్లు
7)బరువులని తూచే బ్రిడ్జి
వేబ్రిడ్జి
8)నీరులేని సాగరం 
దుఃఖసాగరం
9)రోడ్డు  మీద  తిరగని కార్లు
స్వర్ణ కారులు
10)తినే బలి
అంబలి

గమ్మత్తు







1)పొలం దున్నని పోతు ?
జెర్రిపోతు
2)తాగకపోయినా వచ్చే మత్తు ?
 గమ్మత్తు




3)నీరులేని చెరువు ?
అచ్చెరువు
4)పరుసులో పెట్టుకోలేని ధనం ?
సాధనం
5)అవయవాలు లేని దేహం
సందేహం
6)తెల్లకార్డు పై ఇవ్వని రేషన్ ?
ప్రిపరేషన్
7)సుఖం లేని రెస్ట్
అరెస్ట్
8)అందరూ భయపడే గోళం
గందర గోళం
9)నొప్పి పెట్టే కాయ ?
మొట్టికాయ
10)చెరువులో ఉండే కాయ
ఎండ్రకాయ

గోడకుర్చీ

1)మనుషులు తిప్పలేని చక్రం ?



కాలచక్రం
2)మనుషులు నడవని దారులు ?
దోపిడీదారులు
3)నొప్పి పెట్టని వాత ?
తరువాత
4)పెద్దవారిని కూర్చోమని చెప్పలేని కుర్చీ?
గోడకుర్చీ

5)చూసి ఆనందించే విందు ?
కనువిందు
6)పొలం లో పండని ధాన్యం ?


7)గణితం లో లేని సూత్రం ?
మంగళ  సూత్రం
8)చూసి ఆనందించే ఫలాలు ?
దినఫలాలు
9)కర్రలు లేక పోయినా మండే మంట ?
కడుపు మంట
10)కనబడని పటం
కపటం

16, జనవరి 2012, సోమవారం

కమఠం




1)సాధువులు ఉండని మఠం ఏది ?
కమఠం
2)పేరు లో టీ ఉన్నా త్రాగలేనిది ఎవరు ?
కమాటీ
3)ఇంట్లో మగ్గం లేని సాలి ఎవరు ?
కంసాలి
4)తగిలినా దెబ్బతగలని రాయి ఏది?
కిరాయి
5)పూసే ఏరు ?
గన్నేరు
6)పెంచు కునే  సింహం
గ్రామ సింహం (కుక్క)
7)అందరూ గౌర వించే మణి
గ్రామణి
8)పండునుండి పిండలేని రసం ?
నీరసం
9)పాము మింగలేని కప్ప ?
తాళంకప్ప
10)ఏ పార్టీకీ చెందని నాయకుడు ?
వినాయకుడు

బలిచక్రవర్తి


1)మనుషులు లేని విందు ?
కనువిందు

2)ఊరిలో లేని సందు ?
పసందు






3)బచ్చలి కూరలో ఉన్న గొప్ప చక్రవర్తి ?
బలిచక్రవర్తి
4)చారలు లేని జీబ్రా?
ఆల్ జీబ్రా
5)వాసన ఇచ్చే వనము ?
దవనము
6)ఇంటికివెయ్యని వాసము ?
సహవాసము
7)సామానులు మొయ్యని లారి  ?
దలారి
8)లెక్కలు రాయని కరణము
త్రికరణము
9)తాగలేని పాలు ?
దీపాలు
10)వెంకన్న లో క్రిష్నున్ని దొంగ చేసింది ?
వెన్న

ఔరంగజేబు


1)ఎవరి చొక్కాకి లేని జేబు ?
ఔరంగజేబు
2)పెద్దలకి పెట్టలేని పిండాలు?
మూత్రపిండాలు
3)కోపం వస్తే వచ్చే కాలు?
ఉద్రేకాలు
4)గోడ మీద ఉండే టేబుల్?
టైం టేబుల్
5)లెక్కల్లో ఉండే కారం?
గుణకారం 
6)చేతి కి కట్టు కోలేని  వాచీ ఏది ?
తివాచీ
7)మంచానికి లేని కోల్లు ?
పాంకోల్లు
8)గుడ్డు పెట్టని కోడి ?
పకోడి
9)తినే హారం ?
పలహారం
10)ఇంటికి  వెయ్యలేని రేకు ?
పూతరేకు

14, జనవరి 2012, శనివారం

ప్లాట్ ఫారం



1)భారతం లో బరువు ?
భారం
2)తనకుతానుగా చే సే దానం ?
శ్రమదానం
3)తినలేని ఫలం ?
విఫలం 
4)వడ్డి తాండ్రలో  తినేది ?
తాండ్ర
5)పాటించాలిలో కుంతి కోడలు ?
 ద్రౌ పది
6)తీసుకొనే కారం ఏది ?
సహకారం
7)నింపలేని ఫారం ?
ప్లాట్ ఫారం
8)చెర్లపల్లిలో తోబుట్టువు ?
చెల్లి
9)పే రు లో నిషా ?
తానీషా
10)మే క తినని ఆకు ?
చిరాకు 

ఆలేరు




1)అడగ కుందా లేరని చెప్పే ఊ రు ?
ఆలేరు
2)ర్చు పెట్టలేని మనీ ?
ఆమని
3)నేర్చుకోండిలో నిద్ర లేపేది ?
కో డి
4)నేరేడు లో ఈ రో జు ?
నేడు
5)హారతిలో హిందీ ఏనుగు ?
హాతి
6)నాటకంలో లేని రంగం ?
 శ్రీరంగం
7)వంటకి పనికిరాని ఆయిల్ ?
ఫినాయిల్
8)పాలవలసలో స్రమజీవులు వెల్లేది?
వలస
9)సో లార్ లో ఇంగ్లీ షు పుల్లన ?
సో ర్
10)ఎన్నికలలో పో టే చేయని నాయకుడు ?
వినాయకుడు

కాలీ ఫ్లవర్


1)పూజకి పనికిరాని ఫ్లవర్ ?
కాలీ ఫ్లవర్
2)పాడలేని రాగం?
అనురాగం
3)పేరులో పది ఉన్నది ఎ వరు ?
ద్రౌ పది
4)ఆటవస్తువు పేరున్న పువ్వు ఏది ?
బంతి పువ్వు
5)హారంలేని మని ?
గ్రామని
6)బత్తలు నేయని సాలి ఎవరు ?
కంసాలి
7)వినిపించలేని స్వ రం ?
భాస్వ రం
8)బైరాగి లో దాగున్న లోహం?
రాగి
9)చీడపురుగుల్లొ ఇల్లు ఊడ్చే ది ?
చీపురు
10)తో డు లేకుండా చెయ్యలేని సాయం ?
వ్య వసాయం 




నాగురించి

1)అందరూ పూజించే గ్రామం ?
సాలగ్రామం
2)భక్తులు పూజించని సాయి ఎవరు?
కసాయి
3)కూర్చోలేని పీట్ ఏది?
కత్తిపీట
4)మనుషులు లేని పురం ఏది?

గోపురం
5)దేవుడు లేని ఆలయం?
సచివాలయం
6)చక్రా లు లేకుండా  వెల్లే కారు
పుకారు
7)కదపలే ని కాలు ఏది ?
ఉద్రేకాలు
8)చెల్లని కాసు ?
తిరకాసు
9)తినలేని చెరుకు ?
వంటచెరుకు
9)తినలేని పండు ?
విబూది పండు
10)ఇస్టం లేని నామాలు ?
రాజీ నామాలు


నాగురించి

 నాగురించి
మాఇంటి పేరు అయ్యగారి
నాకు ఇష్టం పెరుగ్గారి (పెరుగు గారి)

Perugu vada(ఆవడలు,

నాపేరేమో రామక్రిష్న 
నాపేరు సెలక్షనేమో తాతగారు
పెట్టిందేమో నాన్నగారు
పేరులో ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు 
నాలో ఉన్నాయి వారి భావనలు
నేనేమో రాముడిలాంటి మంచోన్ని
క్రిష్నుడిలాంటీ చిలిపోన్ని
నేచదివింది పాలటిక్స్
నాకు నచ్చదు నేటి పాలకుల ట్రిక్స్
నావ్రుత్తేమో టీచర్
ప్రవ్రుత్తెమో రైటర్ 
నావైసు 54
మనసు 34
నేవెయ్యను జుత్తుకు రంగు
అందరు అనుకుంటారు వీడు ఓల్డు మ్యాన్ అని
నాకు తెలుసు నేను ఓల్డు మ్యాన్ కాదు గోల్ద్ మ్యాన్ అని 
నే రాసినవి చదవండి బాగున్నాయి అనిపిస్తే అభినందించండి 
లేకపోతే మీసూచనలు సలహాలు తెలియజేయండి 
మీసూచనలు సలహాలు పంపేవారికి
వందనాలు అభినందనాలు
                   
                      ఇట్లు  arkayyagari@yahoo.in
                మీ రామక్రిష్న  

నాపేరు గణపతి


 
నాపేరు గణపతి 
ఊరేమో తిరుపతి
ప్రెండేమో చలపతి
తీసేడు దళపతి
పోయింది పరపతి 

పతాకము


 
మెరిసేది కనకము
కరిచేది సునకము
నిండుగా ఉండాలి తటాకము

ఎప్పుడూ ఎగరాలి మన పతాకము
  



అక్కనక్క


షికారుకి వెల్లింది అక్క
అక్కతో వెల్లింది కుక్క
దారిలో కనిపించింది నక్క
ఉస్కో అన్నాది అక్క
తుర్రుమని పరుగెత్తింది నక్క















13, జనవరి 2012, శుక్రవారం

గ్రానైట్




1)అనసూయలో మనిషికి ఉండకూడనిది ?
అసూయ
2)ఎవరికీలేని కన్ను ?
సీతకన్ను
3)బడికిరాని మాస్టర్ ?
పోస్ట్ మాస్టర్
4)తాగలేని పాలు ?
మురిపాలు
5)దండ గుచ్చ లేని పూస ?
వెన్నపూస
6)ఎప్పుడూ మారని తరం ?
వందేమాతరం
7)చెసే పనులు చూసి చెప్పే రుచి ?
అభిరుచి
8)మనుషులు లేని భవనం ?
వక్రీ భవనం
9)మెరిసే నైట్
గ్రానైట్
10)చారలు లే ని  జీబ్రా ?
ఆల్జీబ్రా

భో జనం


1)బ్యాంకు  ఇవ్వని రుణం
దారుణం
2)ఎగ్జా మినర్  దిద్దని పేపర్
న్యూస్  పేపర్
3)జనానికి ఇస్టపడే జనం
భో జనం
4)ఆరోగ్యా న్ని  కాపాడే క్యాండిల్
ఫిల్టర్ క్యాండిల్
5)పిల్లలు భయపడే పూజ
బడితపూజ
6)తొడుక్కొనే రాయి
షరాయి
7)ఏ ధ్యానం చెస్తూ నడిస్తే ప్రమాదం
పరధ్యానం
8)సూది గుచ్చ లేని పూస
వెన్నపూస
9)పాలు తాగని పాప ఏది
కనుపాప
10)సీసాలో పొయ్యలేని ద్రవం
ఉపద్రవం

కరివేపాకు



1)కరివేపాకు లో ఉన్న మరో ఆకు ?
వేప
2)జీవితాంతం లో ఉద్యోగస్తులకు వచ్చేది ?
జీతం
3)అందరూ అన్నా గాడిద పెట్టలే ని ది ?
గుడ్డు
4)ఇంట్లో ఉండే నత్త ?
మేనత్త
5)కారుకంటే జో రుగ వెల్లే కారు ?
పుకారు
6)ఉండవల్లి లో మేలుచేసేది ?
ఉల్లి
7)ఘరణాలో ఉన్న దేశం ?
ఘణా
8)పూజారి దగ్గర ఉన్న టిఫిన్ ?
పూరి
9) కనబడని రాయి ఏది ?
కిరాయి
10)పెల్లికొడుకు కట్టలేని తాళి ?
ఎగతాళి



భజన


1)భక్తజనం చేసేదేమిటి ?
భజన
2)బత్తిలిలో ఉన్న గొప్ప చక్రవర్తి ఎ వరు ?
బలి
3)తప్పదికలో ఉన్న ఉభయచరజీవి ?
కప్ప
4)పల్లు ఉన్నా నమలు లేనిది ఏది ?
దువ్వెన
5)నక్కపల్లి లో రక్తం  తాగేది ఏది ?
నల్లి
6)సహపంక్తిలో ఉన్న పక్షి ఏది ?
హంస
7)సమరం లో తాగేది ?
రసం
8)ముసాయిదాలొ ఉన్న దేవుడు ఎవరు ?
సాయి
9)పులిహోర లో ఉన్న పండుగ ?
హోలి
10)ఇగురు తో పొరుగు జంట పదమేది ?
ఇరుగు