16, జనవరి 2012, సోమవారం

కమఠం




1)సాధువులు ఉండని మఠం ఏది ?
కమఠం
2)పేరు లో టీ ఉన్నా త్రాగలేనిది ఎవరు ?
కమాటీ
3)ఇంట్లో మగ్గం లేని సాలి ఎవరు ?
కంసాలి
4)తగిలినా దెబ్బతగలని రాయి ఏది?
కిరాయి
5)పూసే ఏరు ?
గన్నేరు
6)పెంచు కునే  సింహం
గ్రామ సింహం (కుక్క)
7)అందరూ గౌర వించే మణి
గ్రామణి
8)పండునుండి పిండలేని రసం ?
నీరసం
9)పాము మింగలేని కప్ప ?
తాళంకప్ప
10)ఏ పార్టీకీ చెందని నాయకుడు ?
వినాయకుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి