13, జనవరి 2012, శుక్రవారం

గ్రానైట్




1)అనసూయలో మనిషికి ఉండకూడనిది ?
అసూయ
2)ఎవరికీలేని కన్ను ?
సీతకన్ను
3)బడికిరాని మాస్టర్ ?
పోస్ట్ మాస్టర్
4)తాగలేని పాలు ?
మురిపాలు
5)దండ గుచ్చ లేని పూస ?
వెన్నపూస
6)ఎప్పుడూ మారని తరం ?
వందేమాతరం
7)చెసే పనులు చూసి చెప్పే రుచి ?
అభిరుచి
8)మనుషులు లేని భవనం ?
వక్రీ భవనం
9)మెరిసే నైట్
గ్రానైట్
10)చారలు లే ని  జీబ్రా ?
ఆల్జీబ్రా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి