14, జనవరి 2012, శనివారం

నాగురించి

1)అందరూ పూజించే గ్రామం ?
సాలగ్రామం
2)భక్తులు పూజించని సాయి ఎవరు?
కసాయి
3)కూర్చోలేని పీట్ ఏది?
కత్తిపీట
4)మనుషులు లేని పురం ఏది?

గోపురం
5)దేవుడు లేని ఆలయం?
సచివాలయం
6)చక్రా లు లేకుండా  వెల్లే కారు
పుకారు
7)కదపలే ని కాలు ఏది ?
ఉద్రేకాలు
8)చెల్లని కాసు ?
తిరకాసు
9)తినలేని చెరుకు ?
వంటచెరుకు
9)తినలేని పండు ?
విబూది పండు
10)ఇస్టం లేని నామాలు ?
రాజీ నామాలు


నాగురించి

 నాగురించి
మాఇంటి పేరు అయ్యగారి
నాకు ఇష్టం పెరుగ్గారి (పెరుగు గారి)

Perugu vada(ఆవడలు,

నాపేరేమో రామక్రిష్న 
నాపేరు సెలక్షనేమో తాతగారు
పెట్టిందేమో నాన్నగారు
పేరులో ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు 
నాలో ఉన్నాయి వారి భావనలు
నేనేమో రాముడిలాంటి మంచోన్ని
క్రిష్నుడిలాంటీ చిలిపోన్ని
నేచదివింది పాలటిక్స్
నాకు నచ్చదు నేటి పాలకుల ట్రిక్స్
నావ్రుత్తేమో టీచర్
ప్రవ్రుత్తెమో రైటర్ 
నావైసు 54
మనసు 34
నేవెయ్యను జుత్తుకు రంగు
అందరు అనుకుంటారు వీడు ఓల్డు మ్యాన్ అని
నాకు తెలుసు నేను ఓల్డు మ్యాన్ కాదు గోల్ద్ మ్యాన్ అని 
నే రాసినవి చదవండి బాగున్నాయి అనిపిస్తే అభినందించండి 
లేకపోతే మీసూచనలు సలహాలు తెలియజేయండి 
మీసూచనలు సలహాలు పంపేవారికి
వందనాలు అభినందనాలు
                   
                      ఇట్లు  arkayyagari@yahoo.in
                మీ రామక్రిష్న  

నాపేరు గణపతి


 
నాపేరు గణపతి 
ఊరేమో తిరుపతి
ప్రెండేమో చలపతి
తీసేడు దళపతి
పోయింది పరపతి 

పతాకము


 
మెరిసేది కనకము
కరిచేది సునకము
నిండుగా ఉండాలి తటాకము

ఎప్పుడూ ఎగరాలి మన పతాకము
  



అక్కనక్క


షికారుకి వెల్లింది అక్క
అక్కతో వెల్లింది కుక్క
దారిలో కనిపించింది నక్క
ఉస్కో అన్నాది అక్క
తుర్రుమని పరుగెత్తింది నక్క















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి